1 Chronicles 15:2 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
మందసమును ఎత్తుటకును నిత్యము తనకు సేవ చేయుటకును యెహోవా లేవీయులను ఏర్పరచుకొనెనని చెప్పివారు తప్ప మరి ఎవరును దేవుని మందసమును ఎత్తకూడదని దావీదు ఆజ్ఞ ఇచ్చెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“ఒడంబడిక పెట్టెను మోయటానికి కేవలం లేవీయులు మాత్రమే అనుమతించబడ్డారు. ఒడంబడిక పెట్టెను మోయటానికి, ఆయనను సేవించడానికి యెహోవా లేవీయులను శాశ్వతంగా ఎంపిక చేశాడు” అని దావీదు చెప్పాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
–మందసమును ఎత్తుటకును నిత్యము తనకు సేవచేయుటకును యెహోవా లేవీయులను ఏర్పరచుకొనెనని చెప్పి–వారు తప్ప మరి ఎవరును దేవుని మందసమును ఎత్తకూడదని దావీదు ఆజ్ఞ ఇచ్చెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
తర్వాత దావీదు, “దేవుని మందసాన్ని మోయడానికి నిత్యంగా తనకు సేవ చేయడానికి యెహోవా లేవీయులను ఎన్నుకున్నారు కాబట్టి వారు తప్ప ఇంకెవరు యెహోవా మందసాన్ని మోయకూడదు” అని చెప్పాడు.