1 Chronicles 17:1 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
దావీదు తన యింట నుండి ప్రవక్తయైన నాతానును పిలిపించినేను దేవదారు మ్రానులతో కట్టబడిన నగరులో నివాసము చేయుచున్నాను; యెహోవా నిబంధన మందసము తెరలచాటున నున్నదని చెప్పగా
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
దావీదు తన కొత్త ఇంట్లో ప్రవేశించాక యాజకుడైన నాతానును పిలిచి ఇలా అన్నాడు: “చూడండి, నేను దేవదారు కలపతో నిర్మించిన ఇంటిలో వుంటున్నాను. కాని దేవుని ఒడంబడిక పెట్టె మాత్రం గుడారంలోనే వుంది! నేను దేవునికి ఒక ఆలయం నిర్మింపదలిచాను.”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
దావీదు తన యింటనుండి ప్రవక్తయైన నాతానును పిలిపించి–నేను దేవదారు మ్రానులతో కట్టబడిన నగరులో నివాసము చేయుచున్నాను; యెహోవా నిబంధనమందసము తెరలచాటున నున్నదని చెప్పగా
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
దావీదు తన రాజభవనంలో స్థిరపడిన తర్వాత, అతడు నాతాను ప్రవక్తతో, “ఇదిగో, యెహోవా నిబంధన మందసం గుడారంలో ఉంటుండగా నేను దేవదారు చెక్కలతో కట్టిన భవనంలో నివసిస్తున్నాను” అన్నాడు.