1 Chronicles 17:24 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ఇశ్రా యేలీయుల దేవుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఇశ్రాయేలీయులకు దేవుడైయున్నాడని నీ పేరు ఎన్నటికిని ఘనపరచబడునట్లు నీవు సెలవిచ్చిన మాట నిశ్చయముగా స్థిరపరచబడును గాక; మరియు నీ దాసుడైన దావీదు సంతతి నీ యెదుట స్థిరపరచబడునుగాక.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నీవు నమ్మతగిన వాడవని నిరూపించు తండ్రీ! ప్రజలు నీ పేరును ఎల్లప్పుడూ గౌరవించుదురుగాక! అప్పుడు ‘సర్వశక్తుడగు యెహోవా ఇశ్రాయేలు దైవమని’ ప్రజలు అంటారు! నేను నీ సేవకుడను! దయచేసి నా కుటుంబాన్ని బలపర్చి, నీ సన్నిధిలో వర్థిల్లేలా చేయి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఇశ్రాయేలీయులదేవుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఇశ్రాయేలీయులకు దేవుడైయున్నాడని నీ పేరు ఎన్నటి కిని ఘనపరచబడునట్లు నీవు సెలవిచ్చిన మాట నిశ్చయముగా స్థిరపరచబడును గాక; మరియు నీ దాసుడైన దావీదు సంతతి నీ యెదుట స్థిరపరచబడునుగాక.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అప్పుడు అది సుస్థిరమై మీ పేరు ఎప్పటికీ గొప్పగా ఉంటుంది. అప్పుడు ప్రజలు, ‘సైన్యాల యెహోవా, ఇశ్రాయేలు మీద దేవుడే ఇశ్రాయేలీయుల దేవుడు!’ అని అంటారు. మీ సేవకుడైన దావీదు వంశం మీ ఎదుట స్థిరపరచబడుతుంది.