1 Chronicles 17:7 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
కావున నీవు నా సేవకుడైన దావీదుతో చెప్పవలసినదేమనగాసైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడునీవు నా జనులైన ఇశ్రాయేలీయుల మీద అధిపతివై యుండునట్లు, గొఱ్ఱలవెంబడి తిరుగుచున్న నిన్ను గొఱ్ఱల దొడ్డినుండి తీసికొని
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“కనుక, ఇప్పుడు ఈ విషయాలు నా సేవకుడైన దావీదుకు చెప్పుము: సర్వశక్తిమంతుడగు యెహోవా ఏమి చెప్పుచున్నాడనగా, ‘పొలాల్లో గొర్రెల మందలను కాస్తున్న నిన్ను నేను తీసుకొన్నాను. నా ప్రజలకు నిన్ను రాజుగా చేశాను.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కావున నీవు నా సేవకుడైన దావీదుతో చెప్పవలసినదేమనగా–సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు–నీవు నా జనులైన ఇశ్రాయేలీయులమీద అధిపతివై యుండునట్లు, గొఱ్ఱెలవెంబడి తిరుగుచున్న నిన్ను గొఱ్ఱెల దొడ్డినుండి తీసికొని
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“కాబట్టి ఇప్పుడు నా సేవకుడైన దావీదుతో ఇలా చెప్పు: సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: పచ్చిక మైదానంలో గొర్రెల కాపరిగా ఉన్న నిన్ను తీసుకువచ్చి నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు పాలకునిగా నియమించాను.