1 Chronicles 21:16 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
దావీదు కన్నులెత్తి చూడగా, భూమ్యా కాశముల మధ్యను నిలుచుచు, వరదీసిన కత్తిచేత పట్టుకొని దానిని యెరూషలేముమీద చాపిన యెహోవా దూత కనబడెను. అప్పుడు దావీదును పెద్దలును గోనె పట్టలు కప్పుకొనినవారై సాష్టాంగపడగా
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
దావీదు తలఎత్తి చూడగా యెహోవాదూత ఆకాశంలో కన్పించాడు. దేవదూత తన ఖడ్గాన్ని యెరూషలేము పైకి చాపివున్నాడు. అప్పుడు దావీదు, తదితర పెద్దలు సాష్టాంగ నమస్కారం చేశారు. దావీదు, ఇతర పెద్దలు తమ సంతాపాన్ని తెలియజేసే ప్రత్యేక దుస్తులు ధరించారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
దావీదు కన్నులెత్తి చూడగా, భూమ్యాకాశములమధ్యను నిలుచుచు, వరదీసిన కత్తి చేతపట్టుకొని దానిని యెరూషలేముమీద చాపిన యెహోవాదూత కనబడెను. అప్పుడు దావీదును పెద్దలును గోనె పట్టలు కప్పుకొనినవారై సాష్టాంగపడగా
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
దావీదు పైకి చూసినప్పుడు భూమికి ఆకాశానికి మధ్యలో నిలబడి, కత్తి పట్టుకుని దానిని యెరూషలేము మీద చాపి ఉంచిన యెహోవా దూత అతనికి కనిపించాడు. అప్పుడు దావీదు, పెద్దలు గోనెపట్ట కట్టుకుని సాష్టాంగపడ్డారు.