1 Chronicles 22:14 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు రెండులక్షల మణుగుల బంగారమును పదికోట్ల మణుగుల వెండిని తూచ శక్యముకానంత విస్తార మైన యిత్తడిని యినుమును సమకూర్చియున్నాను; మ్రాను లను రాళ్లను కూర్చియుంచితిని; నీవు ఇంకను సంపా దించుదువుగాక.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“సొలొమోనూ! యెహోవా ఆలయ నిర్మాణానికి ఏర్పాట్లు చేయటంలో నేను చాలా కష్టపడ్డాను. నేను మూడువేల ఏడువందల ఏభై టన్నుల బంగారాన్ని, ముఫై ఏడువేల ఐదువందల టన్నుల వెండిని, తూకం వేయటానికి సాధ్యం కానంత కంచును, ఇనుమును ఇచ్చాను. కలపను, రాయిని కూడ ఇచ్చాను. సొలొమోనూ, నేనిచ్చిన దానికి తోడు నీవింకా కొంత సామగ్రిని సమకూర్చవచ్చు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఇదిగో నేను నా కష్టిస్థతిలోనే ప్రయాసపడి యెహోవా మందిరముకొరకు రెండులక్షల మణుగుల బంగారమును పదికోట్ల మణుగుల వెండిని తూచ శక్యముకానంత విస్తారమైన యిత్తడిని యినుమును సమకూర్చియున్నాను; మ్రానులను రాళ్లను కూర్చియుంచితిని; నీవు ఇంకను సంపా దించుదువుగాక.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“యెహోవా మందిరం కట్టడానికి కావలసిన వాటిని సమకూర్చడం కోసం నేను చాలా శ్రమపడ్డాను. దాని కోసం లక్ష తలాంతుల బంగారాన్ని, పది లక్షల తలాంతుల వెండిని, తూయలేనంత ఇత్తడిని, ఇనుమును సమకూర్చాను. చెక్క, రాళ్లు కూడా సమకూర్చాను. నీవింకా వాటికి కలుపవచ్చు.