1 Chronicles 27:1 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
జనసంఖ్యనుబట్టి ఇశ్రాయేలీయుల పితరుల యింటి .పెద్దలు సహస్రాధిపతులు శతాధిపతులు అనువారి లెక్కనుగూర్చినది, అనగా ఏర్పాటైన వంతుల విషయములో ఏటేట నెలవంతున రాజునకు సేవచేసినవారిని గూర్చినది. వీరి సంఖ్య యిరువది నాలుగు వేలు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
సైన్యంలో చేరి రాజు సేవలో నిమగ్నమైన ఇశ్రాయేలీయుల వివరణ: ప్రతి సంవత్సరంలోను ప్రతి సమూహం ఒక నెలపాటు తమ విధికి హాజరయ్యేది. రాజును సేవించిన వారిలో వంశాలకు అధిపతులు, శతదళాధిపతులు, సహస్ర దళాధిపతులు, మరియు రక్షక భటులు వున్నారు. ప్రతి సైనిక విభాగంలోను ఇరవైనాలుగు వేలమంది మనుష్యులున్నారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
జనసంఖ్యనుబట్టి ఇశ్రాయేలీయుల పితరుల యింటిపెద్దలు సహస్రాధిపతులు శతాధిపతులు అనువారి లెక్కనుగూర్చినది, అనగా ఏర్పాటైన వంతుల విషయములో ఏటేట నెలవంతున రాజునకు సేవచేసినవారిని గూర్చినది. వీరి సంఖ్య యిరువది నాలుగు వేలు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఇది ఇశ్రాయేలీయుల కుటుంబ నాయకులు, సహస్రాధిపతులు, శతాధిపతులు, వివిధ విషయాల్లో రాజుకు సేవలందించే అధికారుల జాబితా. వీరిలో ప్రతి విభాగం సంవత్సరంలో ఒక నెల చొప్పున సేవ చేస్తారు. ఒక్కొక్క విభాగంలో 24,000 మంది సైనికులు ఉన్నారు.