1 Chronicles 27:24 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
జన సంఖ్యచేయు విషయమున ఇశ్రాయేలీయులమీదికి కోపము వచ్చినందున సెరూయా కుమారుడైన యోవాబు దాని చేయనారంభించెనే గాని దాని ముగింపకపోయెను; కాబట్టి జనసంఖ్య మొత్తము దావీదు రాజు వృత్తాంత గ్రంథములలో చేర్చబడలేదు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
సెరూయా కుమారుడైన యోవాబు జనాభా లెక్కలు ప్రారంభించాడు. కాని పూర్తి చేయలేదు. ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు మిక్కిలి కోపం చెందాడు. అందువల్ల రాజైన దావీదు పాలన గురించిన చరిత్ర గ్రంథంలో జనాభాసంఖ్య చేర్చబడలేదు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
జన సంఖ్యచేయు విషయమున ఇశ్రాయేలీయులమీదికి కోపము వచ్చినందున సెరూయా కుమారుడైన యోవాబు దాని చేయనారంభించెనేగాని దాని ముగింపకపోయెను; కాబట్టి జనసంఖ్య మొత్తము దావీదు రాజు వృత్తాంత గ్రంథములలో చేర్చబడలేదు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
సెరూయా కుమారుడైన యోవాబు జనాభా లెక్కలు వ్రాయడానికి ఆరంభించాడు కాని దానిని ముగించలేదు. జనాభా లెక్కలు వ్రాయడం వలన ఇశ్రాయేలు మీదికి దేవుని ఉగ్రత వచ్చింది కాబట్టి ఆ జనసంఖ్య రాజైన దావీదు చరిత్ర గ్రంథంలో నమోదు కాలేదు.