1 Chronicles 4:10 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
యబ్బేజు ఇశ్రాయేలీ యుల దేవునిగూర్చి మొఱ్ఱపెట్టినీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాల పరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడురాకుండ దానిలోనుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవిచేసిన దానిని అతనికి దయచేసెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
యబ్బేజు ఇశ్రాయేలు దేవునికి ఇలా ప్రార్థన చేశాడు: “దేవా, నీవు నన్ను తప్పక ఆశీర్వదించాలని వేడుకొంటున్నాను! నీవు నా దేశాన్ని విస్తరింపజేయాలని కోరుకుంటున్నాను. నీవు సదా నాకు తోడుగా ఉండి, నన్నెవ్వరూ బాధించకుండా కాపాడుము. అప్పుడు నాకేరకమైన వేదనా ఉండదు.” యబ్బేజు కోరుకున్నట్లు దేవుడు అతనికి అన్నీ కలుగుజేశాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యబ్బేజు ఇశ్రాయేలీయుల దేవునిగూర్చి మొఱ్ఱపెట్టి–నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాల పరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడురాకుండ దానిలోనుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవిచేసినదానిని అతనికి దయచేసెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యబ్బేజు ఇశ్రాయేలు దేవునికి మొరపెట్టి, “మీరు నన్ను ఖచ్చితంగా దీవించి నా సరిహద్దులను విశాలపరచండి! మీ చేయి నాకు తోడుగా ఉంచి, నాకు బాధ కలుగకుండా కీడు నుండి నన్ను తప్పించండి” అని ప్రార్థించాడు. దేవుడు అతని మనవి అంగీకరించి దాని ప్రకారం జరిగించారు.