1 Chronicles 6:32 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
సొలొమోను యెరూషలేములో యెహోవా మందిరమును కట్టించువరకు వీరు సమాజపు గుడారముయొక్క ముంగిట సంగీతసేవను ఆచరించుచుండిరి; వారు వంతులచొప్పున తమ పని చూచుకొనుచుండిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
వీరు పవిత్ర గుడారంలో దేవునికి స్తుతి గీతాలు ఆలపించేవారు. పవిత్ర గుడారమే సమావేశ గుడారమని పిలవబడేది. సొలొమోను యెరూషలేములో యెహోవాకు ఆలయాన్ని నిర్మించేవరకు ఈ గాయకులు సంగీత సేవ చేసారు. వారికి నిర్దేశించిన నియమావళిని వారు అనుసరించి పని చేసారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
సొలొమోను యెరూషలేములో యెహోవా మందిరమును కట్టించువరకు వీరు సమాజపు గుడారముయొక్క ముంగిట సంగీతసేవను ఆచరించుచుం డిరి; వారు వంతులచొప్పున తమ పని చూచుకొనుచుండిరి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
సొలొమోను యెరూషలేములో యెహోవా మందిరాన్ని కట్టించేవరకు, వీరు సమావేశ గుడారం ఎదుట సంగీత సేవ చేశారు. వారికి ఇచ్చిన నియమాల ప్రకారం తమ విధులు నిర్వహించేవారు.