1 Chronicles 9:16 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
యదూతోను కుమారు డైన గాలాలునకు పుట్టిన షెమయా కుమారుడైన ఓబద్యా, నెటోపాతీయుల గ్రామములలో కాపురమున్న ఎల్కానా కుమారుడైన ఆసాకు పుట్టిన బెరెక్యా.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఓబద్యా తండ్రి పేరు షెమయా. షెమయా తండ్రి గాలాలు. గాలాలు తండ్రి యెదూతూను, మరియు ఆసా కుమారుడు బెరక్యా. ఆసా తండ్రి పేరు ఎల్కానా. నెటోపాతీయులు నివసించిన గ్రామాలలోనే ఎల్కానా కూడ నివసించాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యెదూతూను కుమారుడైన గాలాలునకు పుట్టిన షెమయా కుమారుడైన ఓబద్యా, నెటోపాతీయుల గ్రామములలో కాపురమున్న ఎల్కానా కుమారుడైన ఆసాకు పుట్టిన బెరెక్యా.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యెదూతూను కుమారుడైన గాలాలుకు పుట్టిన షెమయా కుమారుడైన ఓబద్యా; ఎల్కానాకు పుట్టిన ఆసా కుమారుడైన బెరెక్యా; ఇతడు నెటోపాతీయుల గ్రామాల్లో నివసించాడు.