1 Chronicles 9:19 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
మరియు కోరహు కుమారుడగు ఎబ్యాసాపునకు పుట్టిన కోరే కుమారుడైన షల్లూమును వాని పితరుని యింటివారును వాని సహో దరులగు కోరహీయులును సేవాసంబంధమైన పనిమీదనుండి గుడారమునకు ద్వారపాలకులై యుండిరి; వారి పితరులు యెహోవా పాళెమునకు కావలివారై యుండి ప్రవేశ స్థలమును కాయుచుండిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
షల్లూము తండ్రి పేరు కోరే. కోరే తండ్రి ఎబ్యాసాపు. ఎబ్యాసాపు తండ్రి కోరహు. షల్లూము, అతని సోదరులు ద్వారపాలకులే. వారు కోరహు వంశం వారు. పవిత్ర గుడారపు ద్వారాన్ని కాపలా కాయటం వారిపని. వారి పూర్వీకులు చేసిన విధంగానే వీరుకూడ ఆ పని నిర్వర్తించారు. వారి పూర్వీకులు పవిత్ర గుడారపు ద్వారాన్ని కాపలా కాస్తూ వుండేవారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మరియు కోరహు కుమారుడగు ఎబ్యాసాపునకు పుట్టిన కోరే కుమారుడైన షల్లూమును వాని పితరుని యింటివారును వాని సహోదరులగు కోరహీయులును సేవాసంబంధమైన పనిమీద నుండి గుడారమునకు ద్వారపాలకులై యుండిరి; వారి పితరులు యెహోవా పాళెమునకు కావలివారై యుండి ప్రవేశ స్థలమును కాయుచుండిరి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కోరహు కుమారుడైన ఎబ్యాసాపుకు పుట్టిన కోరే కుమారుడైన షల్లూము, తన కోరహీయుల వంశంలోని తన తోటి ద్వారపాలకులు, తమ పూర్వికులు యెహోవా శిబిరానికి కావలివారిగా ఉన్నట్లుగా, వారు ఆలయద్వారాన్ని కాపలా కాసేవారు.