1 Chronicles 9:29 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
మరియు వారిలో కొందరు మిగిలిన సామగ్రిమీదను పరి శుధ్ధమైన పాత్రలన్నిటిమీదను ఉంచబడియుండిరి; సన్నపు పిండియు ద్రాక్షారసమును నూనెయు ధూప వర్గమును వారి అధీనము చేయబడెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
మరికొందరు ద్వారపాలకులు గర్భగుడిలో సామాన్లు, ఉపకరణాల విషయంలో శ్రద్ధ తీసుకోవటం కోసం ఎంపికచేయబడ్డారు. పిండి, ద్రాక్షారసం, నూనె, ధూపద్రవ్యాలు, సుగంధ ద్రవ్యాల సరఫరా విషయంలో కూడ వారు తగిన శ్రద్ధ తీసుకొనేవారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మరియు వారిలో కొందరు మిగిలిన సామగ్రిమీదను పరిశుద్ధమైన పాత్రలన్నిటిమీదను ఉంచబడియుండిరి; సన్నపు పిండియు ద్రాక్షారసమును నూనెయు ధూప వర్గమును వారి అధీనము చేయబడెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఇతరులకు ఉపకరణాలు, పరిశుద్ధాలయంలో ఉన్న ఇతర వస్తువులన్నిటి బాధ్యత ఇవ్వబడింది. వాటితో పాటు సన్నని పిండి, ద్రాక్షరసం, ఒలీవనూనె, ధూపద్రవ్యాలు, సుగంధద్రవ్యాలు వారి ఆధీనంలోనే ఉంటాయి.