1 Corinthians 7:36 — Compare Translations

5 translations compared side by side

Telugu (BSI) 1880
అయితే ఒకని కుమార్తెకు ఈడు మించిపోయిన యెడలను, ఆమెకు వివాహము చేయవలసివచ్చిన యెడలను, ఆమెకు వివా హము చేయకపోవుట యోగ్యమైనది కాదని ఒకడు తలంచిన యెడలను, అతడ
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
తనతో పెళ్ళి నిశ్చయమైన కన్యను పెళ్ళి చేసుకోకుండా ఉండటం అక్రమమని భావించినవాడు, లేక ఆమెకు వయస్సు పెరిగిపోవటంవల్ల పెళ్ళి చేసుకోవటం అవసరమని భావించినవాడు పెళ్ళి చేసుకోవచ్చు. ఇది పాపం కాదు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అయితే ఒకని కుమార్తెకు ఈడు మించిపోయినయెడలను, ఆమెకు వివాహము చేయవలసివచ్చినయెడలను, ఆమెకు వివాహము చేయకపోవుట యోగ్యమైనది కాదని ఒకడు తలంచినయెడలను, అతడు తన యిష్టముచొప్పున పెండ్లి చేయవచ్చును; అందులో పాపము లేదు, ఆమె పెండ్లి చేసికొనవచ్చును౹
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఒకడు తనతో పెళ్ళి నిశ్చయమైన కన్యను పెళ్ళి చేసుకోకుండా ఉండటం అక్రమమని భావిస్తే, లేక ఆమెకు వయస్సు పెరిగిపోవటం వల్ల పెళ్ళి చేసుకోవటం అవసరమని భావిస్తే, అతడు తన ఇష్ట ప్రకారం చేయవచ్చు. వారు పెళ్ళి చేసుకోవచ్చు. అది పాపం కాదు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఎవరైనా తనకు నిశ్చయమైన కన్య పట్ల గౌరవంగా నడుచుకోవడం లేదని బాధపడితే, ఒకవేళ ఆమె వయస్సు పెరిగిపోవడం వలన పెళ్ళి చేయాలని భావిస్తే, అతడు తాను కోరుకున్నట్లే చేయాలి. అతడు పాపం చేయడం లేదు. వారు పెళ్ళి చేసుకోవాలి.