1 Kings 1:13 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
నీవు రాజైన దావీదునొద్దకు పోయినా యేలినవాడా, రాజా, అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనము మీద ఆసీనుడగునని నీ సేవకురాలనైన నాకు నీవు ప్రమాణ పూర్వకముగా సెలవిచ్చితివే; అదోనీయా యేలుచుండుట యేమని అడుగవలెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
దావీదు రాజు వద్దకు వెళ్లి, ‘నా ప్రభువైన రాజా, నీ తరువాత రాజ్యానికి వారసుడు నా కుమారుడైన సొలొమోను అవుతాడని నీవు ప్రమాణం చేశావు. కాని ఇప్పుడు అదోనీయా ఎందుకు రాజయ్యాడు?’ అని అడుగు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నీవు రాజైన దావీదునొద్దకు పోయి —నా యేలినవాడా, రాజా, అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనము మీద ఆసీనుడగునని నీ సేవకురాలనైన నాకు నీవు ప్రమాణ పూర్వకముగా సెలవిచ్చితివే; అదోనీయా యేలుచుండుట యేమని అడుగవలెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నీవు రాజైన దావీదు దగ్గరకు వెళ్లి, ‘నా ప్రభువా, రాజా, “నా తర్వాత నా కుమారుడైన సొలొమోను రాజు అవుతాడు, అతడు నా సింహాసనం మీద ఆసీనుడవుతాడు” అని మీరు నాకు ప్రమాణం చేయలేదా? ఇప్పుడు అదోనియా ఎందుకు రాజయ్యాడు?’ అని అడుగు.