1 Kings 1:39 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
యాజకుడైన సాదోకు గుడారములోనుండి తైలపు కొమ్మును తెచ్చి సొలొమోనునకు పట్టాభిషేకము చేసెను. అప్పుడు వారు బాకా ఊదగా కూడిన జనులందరునురాజైన సొలొమోను చిరంజీవియగునుగాక అని కేకలువేసిరి
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
యాజకుడైన సాదోకు పవిత్ర గుడారము నుండి తనతో నూనె పట్టుకెళ్లాడు. సాదోకు ఆ నూనెను సొలొమోను తలపైపోసి రాజుగా అభిషిక్తుని చేశాడు. వారప్పుడు బాకా వూదగా అక్కడున్న ప్రజలంతా, “సొలొమోను రాజు వర్ధిల్లుగాక!” అని అన్నారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యాజకుడైన సాదోకు గుడారములోనుండి తైలపు కొమ్మును తెచ్చి సొలొమోనునకు పట్టాభిషేకము చేసెను. అప్పుడు వారు బాకా ఊదగా కూడిన జనులందరును–రాజైన సొలొమోను చిరంజీవి యగునుగాక అని కేకలువేసిరి
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యాజకుడైన సాదోకు పరిశుద్ధ గుడారంలో నుండి కొమ్ముతో నూనె తెచ్చి సొలొమోనును అభిషేకించాడు. అప్పుడు వారు బూర ఊదగా ప్రజలందరు, “రాజైన సొలొమోను చిరకాలం జీవించును గాక!” అని అంటూ కేకలు వేశారు.