1 Kings 1:41 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
అదోనీయాయును అతడు పిలిచిన వారందరును విందులో ఉండగా విందు ముగియబోవు సమయమున ఆ చప్పుడు వారికి వినబడెను. యోవాబు బాకానాదము వినిపట్టణమునందు ఈ అల్లరి యేమని యడుగగా
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఆ సమయంలో అదోనీయా, మరియు అతనితో ఉన్న అతిథులు భోజనాలు పూర్తి చేస్తున్నారు, వారు బూరనాదం విన్నారు. “నగరంలో ఏమి జరుగుతూ వుంది, మనం వినే శబ్దం ఏమిటి?” అని యోవాబు అడిగాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అదోనీయాయును అతడు పిలిచిన వారందరును విందులో ఉండగా విందు ముగియబోవు సమయమున ఆ చప్పుడు వారికి వినబడెను. యోవాబు బాకానాదము విని — పట్టణమునందు ఈ అల్లరి యేమని యడుగగా
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అదోనియా, అతనితో ఉన్న అతిథులందరు తమ విందు ముగింపులో ఆ ధ్వని విన్నారు. ఆ బూరధ్వని విని యోవాబు, “పట్టణంలో ఈ శబ్దమేంటి?” అని అడిగాడు.