1 Kings 1:51 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అదోనీయా రాజైన సొలొ మోనునకు భయపడి బలిపీఠపు కొమ్ములను పట్టుకొనిరాజైన సొలొమోను తన సేవకుడనైన నన్ను కత్తిచేత చంపకుండ ఈ దినమున నాకు ప్రమాణము చేయవలెనని మనవి చేయుచున్నట్లు సొలొమోనునకు సమాచారము రాగా
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఈ లోపు ఒకడు సొలొమోను వద్దకు వెళ్లి, “అదోనీయా నీవంటే చాలా భయపడిపోతున్నాడు. అతడు బలిపీఠం వద్ద ఉన్నాడు. అతడు బలిపీఠపు కొమ్ములను పట్టుకొని, అక్కడినుండి పోవటం లేదు. సొలొమోను వద్దకు ఎవరైనా వెళ్లి తనను చంపకుండా వుండేలా ప్రమాణం చేయించమని వేడుకుంటున్నాడు” అని చెప్పాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అదోనీయా రాజైన సొలొమోనునకు భయపడి బలిపీఠపు కొమ్ములను పట్టుకొని —రాజైన సొలొమోను తన సేవకుడనైన నన్ను కత్తిచేత చంపకుండ ఈ దినమున నాకు ప్రమాణము చేయవలెనని మనవి చేయుచున్నట్లు సొలొమోనునకు సమాచారము రాగా
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అప్పుడు, “అదోనియా రాజైన సొలొమోనుకు భయపడి బలిపీఠపు కొమ్ములను పట్టుకున్నాడు. అతడు, ‘రాజైన సొలొమోను తన దాసుడనైన నన్ను ఖడ్గంతో చంపకుండా ఈ రోజు నాకు ప్రమాణం చేయాలి’ అని అంటున్నాడు” అని సొలొమోనుకు తెలిసింది.