1 Kings 1:53 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
బలిపీఠమునొద్దనుండి అతని పిలువనంపించెను; అతడు వచ్చి రాజైన సొలొమోను ఎదుట సాష్టాంగపడగా సొలొమోను అతనితోనీ యింటికి పొమ్మని సెలవిచ్చెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అప్పుడు సొలొమోను కొంతమందిని పంపి అదోనీయాను తీసుకొని రమ్మన్నాడు. వారు అదోనీయాను రాజైన సొలొమోను వద్దకు తీసుకొచ్చారు. అదోనీయా రాజైన సొలొమోను ముందుకు వచ్చి సాష్టాంగపడ్డాడు. “నీవు ఇంటికి వెళ్లు” అని సొలొమోను అతనితో అన్నాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
బలిపీఠమునొద్దనుండి అతని పిలువనంపించెను; అతడు వచ్చి రాజైన సొలొమోను ఎదుట సాష్టాంగపడగా సొలొమోను అతనితో–నీ యింటికి పొమ్మని సెలవిచ్చెను.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అప్పుడు రాజైన సొలొమోను మనుష్యులను పంపగా వారు అదోనియాను బలిపీఠం దగ్గర నుండి తీసుకువచ్చారు. అతడు వచ్చి రాజైన సొలొమోను ఎదుట సాగిలపడ్డాడు, సొలొమోను అతనితో, “నీ ఇంటికి వెళ్లు” అన్నాడు.