1 Kings 13:26 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
మార్గములోనుండి అతని తోడు కొని వచ్చిన ఆ ప్రవక్త ఆ వర్తమానము వినినప్పుడుయెహోవా మాటను ఆలకింపక తిరుగబడిన దైవజనుడు ఇతడే; యెహోవా సింహమునకు అతని అప్పగించి యున్నాడు; యెహోవా సెలవిచ్చిన ప్రకారము అది అతని చీల్చి చంపెను అని పలికి
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఆ వృద్ధ ప్రవక్తే యూదా దేశాపు దైవజనుని వెనుకకు తీసుకొని వచ్చాడు. వృద్ధ ప్రవక్త జరిగినదంతావిని, “ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ పాటించలేదు. అందువలన యెహోవా ఒక సింహాన్ని అతనిని చంపటానికి పంపాడు. ఇది చేస్తానని యెహోవా చెప్పియున్నాడు” అని అన్నాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మార్గములోనుండి అతని తోడుకొని వచ్చిన ఆ ప్రవక్త ఆ వర్తమానము వినినప్పుడు— యెహోవా మాటను ఆలకింపక తిరుగబడిన దైవజనుడు ఇతడే; యెహోవా సింహమునకు అతని అప్పగించియున్నాడు; యెహోవా సెలవిచ్చిన ప్రకారము అది అతని చీల్చి చంపెను అని పలికి
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ప్రయాణం నుండి అతన్ని వెనుకకు తీసుకువచ్చిన ప్రవక్త దాని గురించి విని, “అతడు యెహోవా మాటను ధిక్కరించిన దైవజనుడు. యెహోవా వాక్కు అతన్ని హెచ్చరించిన ప్రకారం సింహం అతన్ని చీల్చి చంపింది” అని అన్నాడు.