1 Kings 13:33 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఈ సంగతియైన తరువాత యరొబాము తన దుర్మార్గ మును విడిచిపెట్టక, సామాన్యజనులలో కొందరిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించెను. తనకిష్టులైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
రాజైన యరొబాములో ఏమీ మార్పు రాలేదు. అతడు చెడ్డ పనులు చేస్తూనే వున్నాడు. వేర్వేరు వంశాల నుండి మనుష్యులను అతడు యాజకులుగా ఎంపిక చేస్తూనే వున్నాడు. ఈ యాజకులు ఉన్నత ప్రదేశాలలో పూజా కార్యక్రమాలు నిర్వర్తించారు. ఎవరు యాజకుడు కావాలనుకుంటే వారికా అవకాశం ఇవ్వబడింది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఈ సంగతియైన తరువాత యరొబాము తన దుర్మార్గమును విడిచిపెట్టక, సామాన్యజనులలో కొందరిని ఉన్నతస్థలములకు యాజకులుగా నియమించెను. తనకిష్టులైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నతస్థలములకు యాజకులుగా నియమించెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
దీని తర్వాత కూడా యరొబాము తన దుర్మార్గాలను విడిచిపెట్టలేదు, కాని మరోసారి క్షేత్రాలకు అని రకాల ప్రజలను యాజకులుగా నియమించాడు. ఎవరైనా యాజకునిగా ఉండాలనుకుంటే వారిని ఆ క్షేత్రాలకు యాజకులుగా ప్రతిష్ఠించాడు.