1 Kings 13:6 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అప్పుడు రాజునా చెయ్యి మునుపటివలె బాగగునట్లు నీ దేవుడైన యెహోవా సముఖమందు నాకొరకు వేడుకొనుమని ఆ దైవజనుని బతిమాలుకొనగా, దైవజనుడు యెహోవాను బతిమాలుకొనెను గనుక రాజు చెయ్యి మరల బాగై మును పటివలె ఆయెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అప్పుడు యరొబాము దైవజనునితో, “దయచేసి నా కొరకు నీ దేవుడైన యెహోవాను ప్రార్థించు. నా చేతిని బాగు చేయమని యెహోవాను అడుగు” అంటూ ప్రాధేయపడ్డాడు. అందుకొరకు దైవజనుడు యెహోవాను ప్రార్థించాడు. తక్షణమే రాజు చేయి స్వస్థపడింది. అది పూర్వపు చేయిలా ఆరోగ్యవంతంగా వుంది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అప్పుడు రాజు— నా చెయ్యిమునుపటివలె బాగగునట్లు నీ దేవుడైన యెహోవా సముఖమందు నాకొరకు వేడుకొనుమని ఆ దైవజనుని బతిమాలుకొనగా, దైవజనుడు యెహోవాను బతిమాలుకొనెను గనుక రాజు చెయ్యి మరల బాగైమునుపటివలె ఆయెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అప్పుడు రాజు ఆ దైవజనునితో, “నా మీద దయచూపి నా చేయి బాగుపడేలా నా కోసం నీ దేవుడైన యెహోవాకు విజ్ఞాపన ప్రార్థన చేయి” అన్నాడు. దైవజనుడు యెహోవాను వేడుకున్నప్పుడు రాజు చేయి పూర్తిగా బాగుపడి ముందులా అయ్యింది.