1 Kings 14:10 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
కాబట్టి యరొబాము సంతతి వారిమీదికి నేను కీడు రప్పించుచు, ఇశ్రాయేలు వారిలో అల్పులు గాని ఘనులు గాని లేకుండ మగవారినందరిని యరొబాము వంశమునుండి నిర్మూలము చేసి,పెంటఅంతయు పోవునట్లుగా ఒకడు అవతలకు దానిని ఊడ్చి వేసినట్లు యరొబాము సంతతిలో శేషించినవారిని నేను ఊడ్చివేయుదును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
కావున నేను యరొబాము కుటుంబానికి కష్టాలు కలుగజేస్తాను. నీ కుటుంబంలో పురుషులందరినీ చంపివేస్తాను. ఎండిన పేడను అగ్ని దహించి వేయునట్లు నేను నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాను.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కాబట్టి యరొబాము సంతతి వారిమీదికి నేను కీడు రప్పించుచు, ఇశ్రాయేలు వారిలో అల్పులుగాని ఘనులుగానిలేకుండ మగవారినందరిని యరొబాము వంశమునుండి నిర్మూలముచేసి,పెంట అంతయు పోవునట్లుగా ఒకడు అవతలకు దానిని ఊడ్చి వేసినట్లు యరొబాము సంతతిలో శేషించినవారిని నేను ఊడ్చివేయుదును.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“ ‘దీనిని బట్టి నేను యరొబాము వంశం మీదికి కీడు రప్పించబోతున్నాను. నేను ఇశ్రాయేలులో బానిసలు స్వతంత్రులు అని లేకుండా యరొబాము వంశంలోని మగవారినందరిని నిర్మూలం చేస్తాను. ఒకరు పెంటను కాల్చినట్లు యరొబాము వంశాన్ని పూర్తిగా దహించివేస్తాను.