1 Kings 14:2 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
యరొబాము తన భార్యతో ఇట్లనెనునీవు లేచి యరొబాము భార్యవని తెలియబడకుండ మారువేషము వేసికొని షిలోహునకు పొమ్ము; ఈ జనుల మీద నేను రాజునగుదునని నాకు సమాచారము తెలియ జెప్పిన ప్రవక్తయగు అహీయా అక్కడ ఉన్నాడు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
యరొబాము తన భార్యతో ఇలా అన్నాడు: “నీవు షిలోహుకు వెళ్లు. అక్కడ ప్రవక్త అహీయాను దర్శించు. నేను ఇశ్రాయేలుకు రాజునవుతానని చెప్పిన వాడే ఈ అహీయా. నీవు నా భార్యవని ప్రజలకు తెలియకుండా మారువేషం వేసుకొని వెళ్లు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యరొబాము తన భార్యతో ఇట్లనెను —నీవు లేచి యరొబాము భార్యవని తెలియబడకుండ మారువేషము వేసికొని షిలోహునకు పొమ్ము; ఈ జనులమీద నేను రాజునగుదునని నాకు సమాచారము తెలియ జెప్పిన ప్రవక్తయగు అహీయా అక్కడ ఉన్నాడు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యరొబాము తన భార్యతో, “నీవు యరొబాము భార్యవని ఎవ్వరూ గుర్తుపట్టకుండా, మారువేషం వేసుకుని షిలోహుకు వెళ్లు. అక్కడ నేను ఈ ప్రజల మీద రాజునవుతానని నాకు చెప్పిన అహీయా ప్రవక్త ఉంటాడు.