1 Kings 15:27 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఇశ్శాఖారు ఇంటి సంబంధుడును అహీయా కుమారుడునైన బయెషా అతనిమీద కుట్రచేసెను. నాదాబును ఇశ్రాయేలు వారందరును ఫిలిష్తీయుల సంబంధమైన గిబ్బెతోనునకు ముట్టడి వేయుచుండగా గిబ్బెతోనులో బయెషా అతని చంపెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
బయెషా అహీయా కుమారుడు. వారు ఇశ్శాఖారు వంశస్థులు. రాజైన నాదాబును చంపి వేయటానికి బయెషా పధకం వేశాడు. అది నాదాబు, ఇశ్రాయేలు వారంతా కలిసి గిబ్బెతోను నగరంపై దాడి జరుపుతున్న సమయం. గిబ్బెతోను ఫిలిష్తీయుల నగరం. అక్కడ నాదాబును బయెషా హత్య చేశాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఇశ్శాఖారు ఇంటి సంబంధుడును అహీయా కుమారుడునైన బయెషా అతనిమీద కుట్రచేసెను. నాదాబును ఇశ్రాయేలు వారం దరును ఫిలిష్తీయుల సంబంధమైన గిబ్బెతోనునకు ముట్టడి వేయుచుండగా గిబ్బెతోనులో బయెషా అతని చంపెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నాదాబు మీద ఇశ్శాఖారు గోత్రికుడు, అహీయా కుమారుడైన బాషా కుట్రపన్ని, ఇశ్రాయేలు వారంతా ఫిలిష్తీయులకు చెందిన గిబ్బెతోనును ముట్టడిస్తున్న సమయంలో గిబ్బెతోనులో బయెషా నాదాబును చంపేశాడు.