1 Kings 16:11 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అతడు సింహాసనాసీనుడై యేలనారంభించిన తోడనే బయెషా సంతతివారందరిలో ఏ పురుషునే గాని అతని బంధువులలోను మిత్రులలోను ఎవరినేగాని మిగుల నియ్యక అందరిని హతముచేసెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
జిమ్రీ రాజుగా సింహాసనాన్ని అధిష్ఠించగానే, అతడు బయెషా కుటుంబం వారినందరినీ సంహరించాడు. బయెషా వంశంలోని మగవారినెవ్వరినీ అతడు ప్రాణాలతో వదలలేదు. బయెషా స్నేహితులను కూడ జిమ్రీ చంపేశాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అతడు సింహాసనాసీనుడై యేలనారంభించిన తోడనే బయెషా సంతతివారందరిలో ఏ పురుషునేగాని అతని బంధువులలోను మిత్రులలోను ఎవరినేగాని మిగుల నియ్యక అందరిని హతముచేసెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
జిమ్రీ సింహాసనం ఎక్కి పరిపాలించడం మొదలుపెట్టగానే అతడు బయెషా కుటుంబం వారందరినీ చంపేశాడు. అతని బంధువుల్లో, మిత్రులలో మగవారిని ఒక్కరిని కూడ వదలకుండా చంపాడు.