1 Kings 16:2 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
నేను నిన్ను మంటిలోనుండి తీసి హెచ్చింపజేసి ఇశ్రాయేలువారను నా జనులమీద నిన్ను అధికారిగా చేసితిని, అయినను యరొబాము ప్రవర్తించిన ప్రకారముగా నీవు ప్రవర్తించుచు, ఇశ్రాయేలువారగు నా జనులు పాపము చేయుటకు కారకుడవై, వారి పాప ములచేత నాకు కోపము పుట్టించి యున్నావు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“నిన్నొక ముఖ్యమైన వ్యక్తిగా నేను చేశాను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలపై నిన్ను యువరాజుగా చేశాను. నీవు కూడా యరొబాము మార్గాన్నే అనుసరించావు. నా ప్రజలైన ఇశ్రాయేలీయులు తప్పుదారి పట్టేలా చేశావు. వారి పాపకార్యాలతో వారు నాకు కోపం కలుగజేశారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
–నేను నిన్ను మంటిలోనుండి తీసి హెచ్చింప జేసి ఇశ్రాయేలువారను నా జనులమీద నిన్ను అధికారిగా చేసితిని, అయినను యరొబాము ప్రవర్తించిన ప్రకారముగా నీవు ప్రవర్తించుచు, ఇశ్రాయేలువారగు నా జనులు పాపము చేయుటకు కారకుడవై, వారి పాపములచేత నాకు కోపము పుట్టించియున్నావు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“నేను నిన్ను మట్టిలో నుండి పైకి లేవనెత్తి నా ప్రజలైన ఇశ్రాయేలు మీద పాలకునిగా చేశాను. అయితే నీవు యరొబాము విధానాలను అనుసరించి, నా ప్రజలైన ఇశ్రాయేలు పాపం చేసేలా చేసి, వారి పాపాలను బట్టి నాకు కోపం రేపావు.