1 Kings 16:7 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
మరియు బయెషా యరొబాము సంతతి వారివలెనే యుండి తన కార్యములచేత యెహోవా దృష్టికి కీడుచేసి ఆయనకు కోపము పుట్టిం చిన దాని నంతటిని బట్టియు, అతడు తన రాజును చంపుటను బట్టియు, అతనికిని అతని సంతతివారికిని విరోధముగ యెహోవా వాక్కు హనానీ కుమారుడును ప్రవక్తయునగు యెహూకు ప్రత్యక్షమాయెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
కావున ప్రవక్తయగు యెహూకు యెహోవా ఒక వర్తమానం అందించాడు. ఆ వర్తమానం బయెషాకు, అతని కుటుంబానికి వ్యతిరేకంగా వుంది. యెహోవా దృష్టిలో నీచమైన కార్యాలనేకం బయెషా చేశాడు. ఇది యెహోవాకు కోపకారణమయ్యింది. అతనికి ముందు యరొబాము సంతతి వారు చేసిన పనులే బయెషా కూడ చేశాడు. బయెషా యరొబాము కుటుంబం వారినందరినీ చంపివేసినందుకు కూడా యెహోవా కోపంగా వున్నాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మరియు బయెషా యరొబాము సంతతి వారివలెనేయుండి తన కార్యములచేత యెహోవా దృష్టికి కీడుచేసి ఆయనకు కోపము పుట్టించిన దానినంతటినిబట్టియు, అతడు తన రాజును చంపుటనుబట్టియు, అతనికిని అతని సంతతివారికిని విరోధముగ యెహోవా వాక్కు హనానీ కుమారుడును ప్రవక్తయునగు యెహూకు ప్రత్యక్షమాయెను.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అంతేకాక బయెషాకు, అతని వంశానికి వ్యతిరేకంగా యెహోవా వాక్కు హనానీ కుమారుడైన యెహు ప్రవక్త ద్వారా వచ్చింది. ఎందుకంటే యెహోవా దృష్టిలో అతడు చెడు చేసినందుకు, యరొబాము కుటుంబాన్ని నిర్మూలం చేసినందుకు అతడు యెహోవాకు కోపం రేపాడు.