1 Kings 18:13 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
నేను పోయి అహాబునకు వర్తమానము తెలియజెప్పిన తరువాత నీవు అతనికి కనబడని యెడల అతడు నన్ను చంపి వేయును, ఆలాగున ఆజ్ఞ ఇయ్యవద్దు, నీ దాసుడనైన నేను బాల్యమునుండి యెహోవాయందు భయభక్తులు నిలిపిన వాడను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నేను ఏమి చేశానో నీవు వినే వుంటావు! యెజెబెలు యెహోవా యొక్క ప్రవక్తలందరినీ చంపుతూండగా, నేను వంద మంది ప్రవక్తలను గుహలలో దాచాను. ఏభై మంది ప్రవక్తలను ఒక గుహలోను, మరో ఏభై మందిని వేరొక గుహలోను దాచాను. వారికి అన్న పానాదులిచ్చి ఆదుకున్నాను.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యెజెబెలు యెహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా నేను చేసినది నా యేలినవాడవైన నీకు వినబడినది కాదా? నేను యెహోవా ప్రవక్తలలో నూరు మందిని గుహకు ఏబదేసి మందిచొప్పున దాచి, అన్నపానములిచ్చి వారిని పోషించితిని.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నా ప్రభువా, యెజెబెలు యెహోవా ప్రవక్తలను చంపిస్తూ ఉన్నప్పుడు నేను ఏమి చేశానో మీరు వినలేదా? యెహోవా ప్రవక్తల్లో వందమందిని రెండు గుహల్లో దాచాను, ఒక్కొక్క గుహలో యాభైమంది లెక్కన ఉంచి వారికి భోజనం పెట్టి పోషించాను.