1 Kings 18:19 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలువారి నందరిని, యెజెబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు నాలుగువందల ఏబదిమందిని, అషేరాదేవి1 ప్రవక్తలైన నాలుగువందల మందిని నాయొద్దకు కర్మెలు పర్వతము నకు పిలువనంపుమని చెప్పెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఇశ్రాయేలీయులందరినీ ఇప్పుడు కర్మెలు పర్వతం వద్ద నన్ను కలవమని సమాచారం పంపు. పైగా నాలుగు వందల ఏభై మంది బయలు దేవత ప్రవక్తలను, నాలుగు వందల మంది బూటకపు దేవత అషేరా ప్రవక్తలను అక్కడికి తీసుకొనిరా. రాణీ యెజెబెలు ఈ ప్రవక్తలందరినీ పోషిస్తూ వున్నది.”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలువారినందరిని, యెజెబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు నాలుగువందల ఏబదిమందిని, అషేరాదేవి ప్రవక్త లైన నాలుగువందలమందిని నాయొద్దకు కర్మెలు పర్వతమునకు పిలువనంపుమని చెప్పెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఇప్పుడు నీవు ఇశ్రాయేలీయులందరిని కర్మెలు పర్వతం మీద నన్ను కలవమని పిలిపించు. యెజెబెలు బల్ల దగ్గర తినే నాలుగు వందల యాభై బయలు ప్రవక్తలను, నాలుగు వందల అషేరా ప్రవక్తలను కూడా రమ్మను” అని జవాబిచ్చాడు.