1 Kings 18:7 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ఓబద్యా మార్గమున పోవుచుండగా ఏలీయా అతనిని ఎదుర్కొనెను. ఓబద్యా యితని నెరిగి నమస్కారము చేసినా యేలినవాడవైన ఏలీయావు నీవే గదా యని అడుగగా
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఓబద్యా ప్రయాణం చేస్తూండగా అతడు ఏలీయాను కలిశాడు. ఏలీయాను చూడగానే, అతనెవరో ఓబద్యా తెలుసుకున్నాడు. ఓబద్యా ఏలీయాకు సాష్టాంగ నమస్కారం చేసి, “నీవు నా యజమానివైన ఏలీయావే గదా?” అని అడిగాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఓబద్యా మార్గమున పోవుచుండగా ఏలీయా అతనిని ఎదుర్కొనెను. ఓబద్యా యితని నెరిగి నమస్కారము చేసి–నా యేలినవాడవైన ఏలీయావు నీవే గదా యని అడుగగా
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఓబద్యా దారిన వెళ్తుండగా ఏలీయా అతనికి ఎదురయ్యాడు. ఓబద్యా అతన్ని గుర్తుపట్టి సాష్టాంగపడి, “నా ప్రభువా ఏలీయా, నిజంగా మీరేనా?” అన్నాడు.