1 Kings 19:21 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అందు కతడు అతనిని విడిచి వెళ్లి కాడి యెడ్లను తీసి, వధించి వాటిమాంసమును గొర్తినొగల చేత వంటచేసి జనులకు వడ్డిం చెను. వారు భోజనము చేసిన తరువాత అతడు లేచి ఏలీయా వెంబడి వెళ్లి అతనికి ఉపచారము చేయుచుండెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఎలీషా వెళ్లి తన ఇంటి వారితో ఒక ప్రత్యేకమైన విందారగించాడు. ఎలీషా వెళ్లి తన ఎద్దులను చంపాడు. ఎడ్లకు కట్టిన కాడి కర్రతో నిప్పుచేసి, ఎడ్ల మాంసాన్ని ఉడకబెట్టాడు. ఆ మాంసాన్ని అందరికీ ఇచ్చాడు. వారంతా ఆ మాంసాన్ని తిన్నారు. ఎలీషా తరువాత ఏలీయాను అనుసరించి వెళ్లాడు. ఎలీషా ఏలీయాకు సహాయకుడయ్యాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అందుకతడు అతనిని విడిచి వెళ్లి కాడియెడ్లను తీసి, వధించి వాటిమాంసమును గొర్తినొగల చేత వంటచేసి జనులకు వడ్డించెను. వారు భోజనముచేసిన తరువాత అతడు లేచి ఏలీయా వెంబడి వెళ్లి అతనికి ఉపచారము చేయుచుండెను.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కాబట్టి ఎలీషా అతన్ని విడిచి వెనుకకు వెళ్లి ఆ జత ఎడ్లను వధించి వాటి మాంసాన్ని కాడి మ్రానులతో వంట చేసి ప్రజలకు వడ్డించాడు. వారు తినిన తర్వాత అతడు లేచి ఏలీయా వెంట వెళ్లి అతని సేవకుడయ్యాడు.