1 Kings 2:13 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అంతలో హగ్గీతు కుమారుడైన అదో నీయా సొలొమోను తల్లియగు బత్షెబయొద్దకు రాగా ఆమె సమాధానముగా వచ్చుచున్నావా అని అతని నడిగెను. అతడు సమాధానముగానే వచ్చుచున్నానని చెప్పి
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఈ సమయంలో హగ్గీతు కుమారుడైన అదోనీయా సొలొమోను తల్లియగు బత్షెబ వద్దకు వెళ్లాడు. “నీవు సమాధానంతో వచ్చావా?” అని బత్షెబ అతనిని అడిగింది. “అవును. ఐక్యత కోసమే ఈ సందర్శనం.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అంతలో హగ్గీతు కుమారుడైన అదోనీయా సొలొమోను తల్లియగు బత్షెబయొద్దకు రాగా ఆమె —సమాధానముగా వచ్చుచున్నావా అని అతని నడిగెను. అతడు సమాధానముగానే వచ్చుచున్నానని చెప్పి
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
హగ్గీతు కుమారుడైన అదోనియా సొలొమోను తల్లియైన బత్షెబ దగ్గరకు వెళ్లాడు. బత్షెబ అతన్ని, “నీవు సమాధానంగా వచ్చావా?” అని అడిగింది. అతడు, “అవును, సమాధానంగా వచ్చాను” అన్నాడు.