1 Kings 2:22 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అందుకు రాజైన సొలొమోనుషూనే మీయురాలైన అబీషగును మాత్రమే అదోనీయాకొరకు అడుగుట యేల? అతడు నా అన్న కాబట్టి అతనికొరకును, యాజకుడైన అబ్యాతారుకొరకును, సెరూయా కుమారు డైన యోవాబుకొరకును రాజ్యమును అడుగుమని తన తల్లితో చెప్పెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అది విన్న సొలొమోను రాజు, “అబీషగును అతని కిమ్మనే ఎందుకు అడుగుతున్నావు? అతడు నా అన్న గనుక అతను రాజు కావటానికి కూడా అనుమతి ఇమ్మని నన్నెందుకు అడగటం లేదు? యాజకుడైన అబ్యాతారు, యోవాబు కూడా అతనికి మద్దతు ఇస్తారేమో!” అని తన తల్లితో అన్నాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అందుకు రాజైన సొలొమోను–షూనేమీయురాలైన అబీషగును మాత్రమే అదోనీయాకొరకు అడుగుట యేల? అతడు నా అన్న కాబట్టి అతనికొరకును, యాజకుడైన అబ్యాతారుకొరకును, సెరూయా కుమారుడైన యోవాబుకొరకును రాజ్యమును అడుగుమని తన తల్లితో చెప్పెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అందుకు రాజైన సొలొమోను తన తల్లితో, “అదోనియా కోసం షూనేమీయురాలైన అబీషగును ఎందుకు అడుగుతున్నావు? ఎంతైనా అతడు నాకు అన్న కాబట్టి అతని కోసం యాజకుడైన అబ్యాతారు కోసం సెరూయా కుమారుడైన యోవాబు కోసం రాజ్యాన్ని కూడా అడగవచ్చు కదా” అన్నాడు.