1 Kings 2:44 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
నీవు మా తండ్రియైన దావీదునకు చేసినట్టు నీ హృదయములో మెదులుచున్న కీడంతయు నీకు తెలి యును. నీవు చేసిన కీడు యెహోవా నీ తలమీదికే రప్పించును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నీవు నా తండ్రి దావీదు పట్ల చేసిన అనేక తప్పులు నీకు గుర్తుండే వుంటాయి. ఆ తప్పులన్నిటికీ యెహోవా నిన్నిప్పుడు శిక్షిస్తాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
–నీవు మా తండ్రియైన దావీదునకు చేసినట్టు నీ హృదయములో మెదులుచున్న కీడంతయు నీకు తెలియును. నీవు చేసిన కీడు యెహోవా నీ తలమీదికే రప్పించును.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
రాజు షిమీతో ఇంకా మాట్లాడుతూ, “నీవు నా తండ్రియైన దావీదుకు చేసిన కీడు గురించి నీకు తెలుసు. ఇప్పుడు నీవు చేసిన చెడుకు యెహోవా నీకు తిరిగి చెల్లిస్తారు.