1 Kings 20:12 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
బన్హదదును ఆ రాజులును గుడారములయందు విందు జరి గించుకొనుచుండగా, ఈ ప్రత్యుత్తరము వారికి వచ్చెను గనుక అతడు తన సేవకులను పిలిపించి యుద్ధమునకు సిద్ధ పడుడని ఆజ్ఞాపించెను. వారు సన్నద్ధులై పట్టణము ఎదుట నిలువగా
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
రాజైన బెన్హదదు ఇతర పాలకులతో కలిసి తన డేరాలో వున్నాడు. ఆ సమయంలో అతని దూతలు తిరిగి వచ్చి రాజైన అహాబు ఇచ్చిన సమాధానాన్ని అతనికి అందజేశారు. రాజైన బెన్హదదు నగరాన్ని ముట్టడించటానికి సన్నద్ధులు కండని తన మనుష్యులకు ఆజ్ఞ ఇచ్చాడు. కావున వారంతా తమ తమ స్థానాలకు వెళ్లారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
బెన్హదదును ఆ రాజులును గుడారములయందు విందు జరిగించుకొనుచుండగా, ఈ ప్రత్యుత్తరము వారికి వచ్చెను గనుక అతడు తన సేవకులను పిలిపించి యుద్ధమునకు సిద్ధపడుడని ఆజ్ఞాపించెను. వారు సన్నద్ధులై పట్టణము ఎదుట నిలువగా
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఈ వార్త వచ్చినప్పుడు బెన్-హదదు, అతనితో ఉన్న రాజులు తమ గుడారాల్లో త్రాగుతూ ఉన్నారు. అతడు తన మనుష్యులతో, “దాడికి సిద్ధపడండి” అని ఆదేశించాడు. కాబట్టి వారు పట్టణం మీద దాడి చేయడానికి సిద్ధపడ్డారు.