1 Kings 20:13 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ప్రవక్తయైన యొకడు ఇశ్రాయేలు రాజైన అహాబునొద్దకు వచ్చి అతనితో ఇట్లనెనుయెహోవా సెలవిచ్చునదేమనగాఈ గొప్ప దండంతయు నీవు చూచితివే; నేను యెహోవానని నీవు గ్రహించునట్లు నేడు దానిని నీచేతి కప్పగించెదను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అదే సమయంలో ఒక ప్రవక్త రాజైన అహాబు వద్దకు వెళ్లి యెహోవా ఇలా అంటున్నాడని చెప్పాడు: “ఆ పెద్ద సైన్యాన్ని నీవు చూస్తున్నావు గదా! దేవుడనైన నేను నీవు ఆ మహా సైన్యాన్ని ఈ రోజు ఓడించేలా చేస్తాను. అప్పుడు నేనే నిత్యుడనైన యెహోవానని నీవు గుర్తిస్తావు.”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ప్రవక్తయైన యొకడు ఇశ్రాయేలురాజైన అహాబునొద్దకు వచ్చి అతనితో ఇట్లనెను— యెహోవా సెలవిచ్చునదేమనగా–ఈ గొప్ప దండంతయు నీవు చూచితివే; నేను యెహోవానని నీవు గ్రహించునట్లు నేడు దానిని నీచేతి కప్పగించెదను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఈలోగా, ఇశ్రాయేలు రాజైన అహాబు దగ్గరకు ఒక ప్రవక్త వచ్చి, “యెహోవా చెప్పే మాట ఇదే: ‘ఈ గొప్ప సైన్యాన్ని చూస్తున్నావా? దానిని ఈ రోజు నీ చేతికి అప్పగిస్తాను, అప్పుడు యెహోవాను నేనని నీవు తెలుసుకుంటావు’ ” అని ప్రకటించాడు.