1 Kings 20:14 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఇది యెవరిచేత జరుగునని అహాబు అడుగగా అతడురాజ్యాధిపతులలో ఉన్న ¸°వనులచేత జరుగునని యెహోవా సెల విచ్చుచున్నాడని చెప్పెను. యుద్ధమును ఎవరు ఆరంభము చేయవలెనని రాజు అడుగగా అతడునీవే అని ప్రత్యుత్తరమిచ్చెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“వారిని ఓడించటానికి నీవు ఎవరిని ఉపయోగిస్తావు?” అని అహాబు అడిగాడు. “యువకులైన ప్రభుత్వాధికారులను” అని యెహోవా సెలవిస్తున్నాడని ప్రవక్త అన్నాడు. “ప్రధాన సైన్యాన్ని ఎవరు నడుపుతారు?” అని రాజు అడిగాడు. “నీవే” అని ప్రవక్త అన్నాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
–ఇది యెవరిచేత జరుగునని అహాబు అడుగగా అతడు–రాజ్యాధిపతులలో ఉన్న యౌవనులచేత జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పెను. —యుద్ధమును ఎవరు ఆరంభము చేయవలెనని రాజు అడుగగా అతడు–నీవే అని ప్రత్యుత్తరమిచ్చెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“కాని ఇది ఎవరు చేస్తారు?” అని అహాబు అడిగాడు. అందుకు ప్రవక్త అన్నాడు, “యెహోవా చెప్పే మాట ఇదే: ‘ప్రాంతీయ అధికారుల దగ్గర పని చేసే యువ అధికారులు చేస్తారు.’ ” “ఎవరు యుద్ధం ఆరంభిస్తారు?” అని అహాబు అడిగాడు. “నీవే” అని ప్రవక్త జవాబిచ్చాడు.