1 Kings 20:32 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
కావున వారు తమ నడుములకు గోనెలు కట్టుకొని తలమీద త్రాళ్లు వేసి కొని ఇశ్రాయేలు రాజునొద్దకు వచ్చినీ దాసుడైన బెన్హదదుదయచేసి నన్ను బ్రదుకనిమ్మని మనవి చేయుటకై మమ్మును పంపెనని చెప్పగా అతడుబెన్హదదు నా సహోదరుడు, అతడు ఇంకను సజీవుడై యున్నాడా అని యడిగెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
వారు గోనెపట్టలు చుట్టుకుని, తలపై తాళ్లు వేసుకున్నారు. వారు ఇశ్రాయేలు రాజు వద్దకు వచ్చి, “మీ సేవకుడు బెన్హదదు దయచేసి తనను బ్రతకనివ్వమని అడుగుతున్నాడు” అని చెప్పారు. “అయితే అతడింకా బ్రతికే వున్నాడా? అతడు నా సహోదరుడే!” అన్నాడు అహాబు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కావునవారు తమ నడుములకు గోనెలు కట్టుకొని తలమీద త్రాళ్లు వేసికొని ఇశ్రాయేలురాజు నొద్దకు వచ్చి–నీ దాసుడైన బెన్హదదు–దయచేసి నన్ను బ్రదుకనిమ్మని మనవి చేయుటకై మమ్మును పంపెనని చెప్పగా అతడు–బెన్హదదు నా సహోదరుడు, అతడు ఇంకను సజీవుడై యున్నాడా అని యడిగెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వారు నడుముకు గోనెపట్ట కట్టుకుని, తలమీద త్రాళ్లు వేసుకుని, ఇశ్రాయేలు రాజు దగ్గరకు వెళ్లి అన్నారు, “మీ సేవకుడైన బెన్-హదదు ఇలా చెప్తున్నాడు: ‘దయచేసి నన్ను బ్రతకనివ్వండి.’ ” రాజు జవాబిస్తూ, “అతడు ఇంకా ప్రాణంతో ఉన్నాడా? అతడు నా సోదరుడు” అని అన్నాడు.