1 Kings 20:39 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
రాజు వచ్చుట చూచి బిగ్గరగా రాజుతో ఈలాగు మనవి చేసికొనెనునీ దాసుడనైన నేను యుద్ధములోనికి పోయియుండగా ఇదిగో ఒకడు ఇటు తిరిగి ఒక మనుష్యుని నాయొద్దకు తోడుకొని వచ్చి యీ మనుష్యుని కనిపెట్టుము; ఏ విధము గానైనను వాడు తప్పించుకొని పోయినయెడల వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణముపోవును; లేదా నీవు రెండు మణుగుల వెండిని ఇయ్యవలెననెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
రాజు వచ్చినప్పుడు ప్రవక్త అతనితో ఇలా అన్నాడు: “నేను యుద్ధం చేయటానికి వెళ్లాను. మనలో ఒకడు శత్రుసైనికునొకణ్ణి నా వద్దకు తీసుకుని వచ్చాడు. ఆ శత్రు సైనికునికి కాపలా వుండమనీ, వాడు గనుక పారిపోతే అతని స్థానంలో నేను నా ప్రాణాలను ఇవ్వవలసి వుంటుందనీ మన సైనికుడు నాతో చెప్పాడు. లేదా రెండు మణుగుల వెండి చెల్లించవలసి వుంటుందని అన్నాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
రాజు వచ్చుట చూచి బిగ్గరగా రాజుతో ఈలాగు మనవి చేసికొనెను–నీ దాసుడనైన నేను యుద్ధములోనికి పోయియుండగా ఇదిగో ఒకడు ఇటు తిరిగి ఒక మనుష్యుని నాయొద్దకు తోడుకొని వచ్చి యీ మనుష్యుని కనిపెట్టుము; ఏ విధముగానైనను వాడు తప్పించుకొనిపోయినయెడల వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణముపోవును; లేదా నీవు రెండు మణుగుల వెండిని ఇయ్యవలెననెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
రాజు దారిన వెళ్తుండగా, ప్రవక్త రాజును పిలిచి, “మీ సేవకుడనైన నేను యుద్ధం మధ్యలోకి వెళ్లాను. అక్కడ ఒకడు ఒక బందీని తీసుకుని నా దగ్గరకు వచ్చి, ‘ఈ వ్యక్తిని చూసుకోండి. ఒకవేళ అతడు తప్పిపోతే, వాడి ప్రాణానికి బదులుగా నీ ప్రాణం పెట్టాలి. లేదా నీవు ఒక తలాంతు వెండి ఇవ్వాలి’ అని చెప్పాడు.