1 Kings 20:9 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
గనుక అతడుమీరు రాజైన నా యేలిన వానితో తెలియజెప్పవలసినదేమనగానీవు మొదట నీ సేవకుడనైన నాకు ఇచ్చిపంపిన ఆజ్ఞను నేను తప్పక అనుసరింతును గాని, నీవిప్పుడు సెలవిచ్చిన దానిని నేను చేయలేనని బెన్హదదు దూతలతో చెప్పుడనెను. ఆ దూతలు పోయి బెన్హదదునొద్దకు వచ్చి ఆ ప్రత్యుత్తరము తెలియజేయగా
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
బెన్హదదుకు తిరుగు సమాధానంలో అహాబు ఇలా అన్నాడు: “నేను నీవు ముందు చెప్పిన విధంగా చేస్తాను. కాని నీవు రెండవసారి ఆజ్ఞ ఇచ్చినట్లుగా నేను చేయజాలను.” రాజైన బెన్హదదు మనుష్యులు ఈ సమాచారాన్ని అతనికి అందజేశారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
గనుక అతడు–మీరు రాజైన నా యేలినవానితో తెలియజెప్పవలసినదేమనగా— నీవు మొదట నీ సేవకుడనైన నాకు ఇచ్చిపంపిన ఆజ్ఞను నేను తప్పక అనుసరింతును గాని, నీవిప్పుడు సెలవిచ్చిన దానిని నేను చేయలేనని బెన్హదదు దూతలతో చెప్పుడనెను. ఆ దూతలు పోయి బెన్హదదునొద్దకు వచ్చి ఆ ప్రత్యుత్తరము తెలియజేయగా
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కాబట్టి అతడు బెన్-హదదు యొక్క దూతలతో ఇలా అన్నాడు, “నా ప్రభువా, రాజుతో చెప్పండి, ‘మీ సేవకుడనైన నాకు మీరు మొదట చెప్పిన మాట ప్రకారం చేస్తాను. కాని, ఈసారి మీరు కోరినట్టు నేను చేయలేను.’ ” వారు వెళ్లి బెన్-హదదుతో ఆ వార్త చెప్పారు.