1 Kings 21:13 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అప్పుడు పనికిమాలిన యిద్దరు మనుష్యులు సమాజములో ప్రవేశించి అతని యెదుట కూర్చుండినాబోతు దేవునిని రాజును దూషించెనని జనుల సమక్షమున నాబోతుమీద సాక్ష్యము పలుకగా వారు పట్టణము బయటికి అతనిని తీసికొని పోయి రాళ్లతో చావగొట్టిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అప్పుడు ఇద్దరు మనుష్యులు లేచి నాబోతు దేవునిని, రాజును గూర్చి దుర్భాషలాడుతూండగా తాము విన్నట్లు ప్రజలకు చెప్పారు. అందువల్ల ప్రజలు నాబోతును నగరం నుండి బయటికి లాక్కొని వెళ్లి, అతనిని రాళ్లతో కొట్టి చంపారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అప్పుడు పనికిమాలిన యిద్దరు మనుష్యులు సమాజములో ప్రవేశించి అతని యెదుట కూర్చుండి— నాబోతు దేవునిని రాజును దూషించెనని జనుల సమక్షమున నాబోతుమీద సాక్ష్యము పలుకగా వారు పట్టణము బయటికి అతనిని తీసికొనిపోయి రాళ్లతో చావగొట్టిరి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అప్పుడు ఇద్దరు దుర్మార్గులు వచ్చి అతనికి ఎదురుగా కూర్చుని ప్రజల ముందు, “నాబోతు దేవున్ని రాజును శపించాడు” అని అంటూ నాబోతు మీద నేరం మోపారు. కాబట్టి వారు అతన్ని పట్టణం బయటకు తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపారు.