1 Kings 21:6 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అతడు ఆమెతో ఇట్లనెనునీ ద్రాక్షతోటను క్రయమునకు నాకిమ్ము; లేక నీకు అనుకూలమైనయెడల దానికి మారుగా మరియొక ద్రాక్షతోట నీ కిచ్చెదనని, యెజ్రె యేలీయుడైన నాబోతుతో నేను చెప్పగా అతడునా ద్రాక్షతోట నీ కియ్యననెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అహాబు ఇలా సమాధానం చెప్పాడు: “యెజ్రెయేలువాడైన నాబోతును అతని పొలం నాకిమ్మని అడిగాను. దాని పూర్తి ఖరీదు చెల్లిస్తానన్నాను. లేదా, అతను కావాలంటే వేరే పొలం ఇస్తానన్నాను. కాని నాబోతు అతని పొలం ఇవ్వటానికి నిరాకరించాడు.”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అతడు ఆమెతో ఇట్లనెను–నీ ద్రాక్షతోటను క్రయమునకు నాకిమ్ము; లేక నీకు అనుకూలమైనయెడల దానికి మారుగా మరియొక ద్రాక్షతోట నీకిచ్చెదనని, యెజ్రెయేలీయుడైన నాబోతుతో నేను చెప్పగా అతడు–నా ద్రాక్షతోట నీకియ్యననెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అందుకతడు, “నేను యెజ్రెయేలీయుడైన నాబోతుతో, ‘నీ ద్రాక్షతోటను నాకు వెండికి అమ్ము; లేదా నీకిష్టమైతే నీ తోటకు బదులుగా నేను నీకు ఇంకొక తోట ఇస్తాను’ అని అన్నాను. కాని అతడు, ‘నా ద్రాక్షతోట మీకివ్వను’ అన్నాడు” అని చెప్పాడు.