1 Kings 22:15 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అతడు రాజునొద్దకు వచ్చినప్పుడు రాజుమీకాయా, నీవేమందువు? యుద్ధము చేయుటకు మేము రామోత్గిలాదుమీదికి పోదుమా పోకుందుమా అని యడుగగా అతడుయెహోవా దానిని రాజవైన నీ చేతికి నప్ప గించును గనుక నీవు దానిమీదికిపోయి జయమొందుదువని రాజుతో అనెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
తరువాత మీకాయా వచ్చి రాజైన అహాబు ముందు నిలబడ్డాడు. రాజు అతనిని ఇలా అడిగాడు: “మీకాయా, రాజైన యెహోషాపాతు, నేను మా సైన్యాలను కలుపవచ్చా? ఇప్పుడు మేము వెళ్లి రామోత్గిలాదు వద్ద అరాము సైన్యంతో పోరాడవచ్చునా?” “అవును. మీరు వెళ్లి వారితో ఇప్పుడు యుద్ధం చేయవచ్చు. యెహోవా నిన్ను గెలిపిస్తాడు” అని మీకాయా సమాధానం చెప్పాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అతడు రాజునొద్దకు వచ్చినప్పుడు రాజు–మీకాయా, నీవేమందువు? యుద్ధము చేయుటకు మేము రామోత్గిలాదుమీదికి పోదుమా పోకుందుమా అని యడుగగా అతడు–యెహోవా దానిని రాజవైన నీ చేతికి నప్పగించును గనుక నీవు దానిమీదికిపోయి జయమొందుదువని రాజుతో అనెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అతడు వచ్చినప్పుడు రాజు అతన్ని, “మీకాయా, మేము రామోత్ గిలాదు మీదికి యుద్ధానికి వెళ్లాలా, లేదా?” అని అడిగాడు. అందుకతడు, “దాడి చేయండి, విజయం పొందండి, ఎందుకంటే యెహోవా దానిని రాజు చేతికి అప్పగిస్తారు” అని జవాబిచ్చాడు.