1 Kings 5:3 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
యెహోవా నా తండ్రియైన దావీదు శత్రువులను అతని పాదములక్రింద అణచు వరకు అన్నివైపులను యుద్ధములు అతనికి కలిగియుండెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“నా తండ్రియగు రాజైన దావీదు చుట్టుప్రక్కల రాజ్యాల వారితో అనేక యుద్ధాలు చేసినట్లు నీకు తెలుసు. అందువల్ల యెహోవాయగు తన దేవుని ఘనపరిచేలా ఒక దేవాలయం నిర్మించ లేకపోయాడు. తన శత్రువులందరినీ యెహోవా తాను ఓడించేలా చేసే వరకు రాజైన దావీదు వేచివున్నాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
–యెహోవా నా తండ్రియైన దావీదు శత్రువులను అతని పాదములక్రింద అణచువరకు అన్నివైపులను యుద్ధములు అతనికి కలిగియుండెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“యెహోవా, నా తండ్రియైన దావీదు శత్రువులను అతని పాదాల క్రింద అణచే వరకు అతడు అన్ని వైపుల నుండి యుద్ధాలు చేశాడు. కాబట్టి అతడు తన దేవుడైన యెహోవా నామం కోసం ఒక దేవాలయాన్ని కట్టలేకపోయాడు.