1 Kings 8:37 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
దేశమందు క్షామము గాని తెగులు గాని గాడ్పు దెబ్బ గాని చిత్తపట్టుట గాని మిడతలు గాని చీడపురుగు గాని కలిగినను, వారి శత్రువువారి దేశపు పట్టణములలో వారిని ముట్టడి వేసినను, ఏ తెగులు గాని వ్యాధి గాని కలిగినను,
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“ఈ నేల బాగా ఎండిపోయి, పంటలు పండక పోవచ్చు. లేక భయంకర వ్యాధి ప్రజలలో వ్యాపించవచ్చు. బహుశా పండిన పంటనంతా క్రిమికీటకాదులు నాశనం చేయవచ్చు. లేక నీ ప్రజలు వారి నగరాలలో శత్రువాత పడవచ్చు లేక నీ ప్రజలలో చాలామంది వ్యాధిగ్రస్థులు కావచ్చు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
దేశమందు క్షామముగాని తెగులుగాని గాడ్పుదెబ్బగాని చిత్తపట్టుటగాని మిడ తలుగాని చీడపురుగుగాని కలిగినను, వారి శత్రువు వారి దేశపు పట్టణములలో వారిని ముట్టడి వేసినను, ఏ తెగులుగాని వ్యాధిగాని కలిగినను,౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“దేశంలో కరువు గాని తెగులు గాని వడగాలి గాని నాచు గాని మిడతలు గాని పురుగులు గాని వచ్చినా, వారి శత్రువు వారి పట్టణాల్లో వారిని ముట్టడి చేసినా, ఏదైనా విపత్తు గాని రోగం గాని వచ్చినా,