1 Kings 8:52 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
కాబట్టి నీ దాసుడనైన నేను చేయు విన్నపముమీదను, ఇశ్రాయేలీయులగు నీ జనులు చేయు విన్నపముమీదను, దృష్టియుంచి,వారు ఏ విషయములయందు నిన్ను వేడుకొందురో ఆ విషయముల యందు వారి విన్నపముల నాలకించుము.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“ప్రభువైన దేవా, నా ప్రార్థనలను, నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల ప్రార్థనలను దయచేసి ఆలకించు. వారు ఏ సమయములో నిన్ను నీ సహాయము కోరి ప్రార్థించినా వారి ప్రార్థన విను.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కాబట్టి నీ దాసుడనైన నేనుచేయు విన్నపముమీదను, ఇశ్రాయేలీయులగు నీ జనులుచేయు విన్నపముమీదను, దృష్టియుంచి, వారు ఏ విషయములయందు నిన్ను వేడుకొందురో ఆ విషయములయందు వారి విన్నపముల నాలకించుము.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“కాబట్టి మీ కనుదృష్టి మీ దాసుని మీద, ఇశ్రాయేలు ప్రజల విన్నపం మీద ఉండును గాక, వారు మీకు మొరపెట్టినప్పుడు మీరు విందురు గాక.