1 Kings 8:65 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
మరియు ఆ సమయమున సొలొమోనును అతనితో కూడ ఇశ్రాయేలీయులందరును హమాతునకు పోవుమార్గము మొదలుకొని ఐగుప్తునది వరకు నున్న సకల ప్రాంతములనుండి వచ్చిన ఆ మహాసమూహమును రెండు వారములు, అనగా పదునాలుగు దినములు యెహోవా సముఖమందు ఉత్సవముచేసిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
రాజైన సొలొమోను, ఇశ్రాయేలీయులు దేవాలయంలో ఆ విధంగా పండుగ జరుపుకున్నారు. ఉత్తర భాగాన బహుదూరంలో ఉన్న హమాతు కనుమ నుండి దక్షిణాన ఈజిప్టు సరిహద్దు వరకుగల ఇశ్రాయేలీయులంతా పండుగలో పాల్గొన్నారు. లెక్కకు మించిన జనాభా అక్కడ చేరింది. ఏడు రోజులపాటు వారంతా అక్కడ ఆహారపానీయాలు స్వీకరిస్తూ వేడుక చేసుకున్నారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మరియు ఆ సమయమున సొలొమోనును అతనితోకూడ ఇశ్రాయేలీయులందరును హమాతునకు పోవుమార్గము మొదలుకొని ఐగుప్తునదివరకు నున్న సకల ప్రాంతములనుండి వచ్చిన ఆ మహాసమూహమును రెండు వారములు, అనగా పదునాలుగు దినములు యెహోవా సముఖమందు ఉత్సవముచేసిరి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆ సమయంలో సొలొమోను అతనితో ఇశ్రాయేలు ప్రజలంతా పండుగ చేశారు. లెబో హమాతుకు వెళ్లే మార్గం నుండి ఈజిప్టు వాగువరకు ఉన్న ప్రాంతాల నుండి ప్రజలు గొప్ప సమూహంగా వచ్చి దేవుడైన యెహోవా ఎదుట ఏడు రోజులే కాకుండ మరి ఏడు రోజులు, మొత్తం పద్నాలుగు రోజులు పండుగ చేసుకున్నారు.