1 Peter 2:8 — Compare Translations

5 translations compared side by side

Telugu (BSI) 1880
కట్టువారు వాక్యమున కవిధేయులై తొట్రిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
మరొక చోట యిలా వ్రాయబడి ఉంది: “ఈ రాయి, మానవులు తొట్రుపడేటట్లు చేస్తుంది. ఈ బండ వాళ్ళను క్రింద పడవేస్తుంది.” దైవసందేశాన్ని నిరాకరించిన వాళ్ళు తొట్రుపడతారు. వాళ్ళు దానికని నిర్ణయించబడ్డారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కట్టువారు వాక్యమునకవిధేయులై తొట్రిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి.౹
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అది “అడ్డురాయి, అడ్డుబండ” అయింది. వారు వాక్యానికి అవిధేయులై తొట్రుపడుతున్నారు. దాని కోసమే దేవుడు వారిని నియమించాడు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అంతేకాదు, “అది ప్రజలు తడబడేలా చేసే అడ్డురాయి, వారిని పడిపోయేలా చేసే అడ్డుబండ అయ్యింది.” వారిని పడద్రోసేది ఈ రాయే, వారు ఆ వాక్యానికి అవిధేయులు అయినందుకు వారు పతనమయ్యారు. వారిని గురించిన దేవుని సంకల్పం అలాంటిది.