1 Samuel 1:23 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
కాబట్టి ఆమె పెనిమిటియైన ఎల్కానానీ దృష్టికి ఏది మంచిదో అది చేయుము; నీవు వానికి పాలు మాన్పించు వరకు నిలిచి యుండుము, యెహోవా తన వాక్యమును స్థిరపరచును గాక అని ఆమెతో అనెను. కాగా ఆమె అక్కడనే యుండి తన కుమారునికి పాలు మాన్పించు వరకు అతని పెంచుచుండెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“నీకు ఎలా మంచిదనిపిస్తే అలా చేయి. కుమారుడు స్వయంగా ఆహారం తినగలిగే వయస్సు వచ్చే వరకు ఇంటివద్దనే ఉండు. యెహోవా తన వాగ్దానం నెరవేర్చునుగాక” అని ఆమె భర్త ఎల్కానా అన్నాడు. తన కుమారుని పెంచుతూ హన్నా ఇంటి వద్దనే ఉండి పోయింది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కాబట్టి ఆమె పెనిమిటియైన ఎల్కానా–నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుము; నీవు వానికి పాలు మాన్పించువరకు నిలిచి యుండుము, యెహోవా తన వాక్యమును స్థిరపరచును గాక అని ఆమెతో అనెను. కాగా ఆమె అక్కడనేయుండి తన కుమారునికి పాలు మాన్పించువరకు అతని పెంచుచుండెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“నీకు ఏది మంచిదో అది చేయి, వానిని పాలు మాన్పించేవరకు నీవు ఇక్కడే ఉండు; యెహోవా తన మాట నెరవేర్చును గాక” అని ఆమె భర్తయైన ఎల్కానా ఆమెతో చెప్పాడు. కాబట్టి ఆ స్త్రీ తన కుమారుని పాలు మాన్పించేవరకు ఇంట్లోనే ఉండి వానిని పోషించింది.